కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో 24 వేళ్లతో శిశువు జననం

మాములుగా 6 వేళ్ల తో శిశువులు పుట్టడం..కామన్ గా అక్కడక్కడ జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ఏకంగనా 24 తో శిశువు జన్మచ్చిన ఘటన కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం ఏరుగట్లకు చెందిన రవళి అనే మహిళకు పురిటినొప్పులు రావటంతో కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది ఆమెకు సాధారణ ప్రసవం చేశారు.

ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. అయితే పసికందుకు రెండు కాళ్లు, రెండు చేతులకు కూడా ఆరువేళ్లు ఉండటాన్ని చూసి డాక్టర్స్ షాక్ అయ్యారు. ప్రతి చేయి కాలుకు ఆరు వేళ్ల చొప్పున మెుత్తం 24 వేళ్లతో శిశువు జన్మించాడు. ఇలా ఆరు వేళ్లతో జన్మించిన పిల్లలు పుట్టడం అత్యంత అరుదుగా జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయం బయటకు రావడం తో ఆ శిశువును చూసేందుకు స్థానికులు పోటీపడుతున్నారు.