ప్ర‌తి గురువారం రాష్ట్ర బ‌స్సు దినోత్స‌వం నిర్వ‌హించాల‌ని సజ్జనార్ ఆదేశం

తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్…అప్పటి నుండి వార్తల్లో నిలుస్తూవస్తున్నారు. నష్టాలఉబిలో ఉన్న ఆర్టీసీ ని లాభాల్లోకి తెచ్చేందుకు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్న సజ్జనార్..తాజాగా ప్ర‌తి గురువారం రాష్ట్ర బ‌స్సు దినోత్స‌వం నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసారు.

ఈ బ‌స్సు దినోత్స‌వం రోజు ఆర్టీసీ ఉద్యోగులు.. అధికారులు అంత కూడా ఆర్టీసీ బ‌స్సులల్లోనే ప్ర‌యాణించాల‌ని సూచించాడు. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేయ‌డం వ‌ల్ల ప్ర‌యాణీకుల స‌మ‌స్య‌ల ను నేరుగా తెలుసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని స‌జ్జ‌నార్ అన్నారు. ఆస‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించి.. మెరుగైన సేవ‌ల‌ను అందించ వ‌చ్చ‌ని అన్నారు.