ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో అధికంగా పత్తి పంట

puvvada ajay kumar
minister puvvada ajay kumar

ఖమ్మం: ఖ‌మ్మం త్రీటౌన్‌లోని ప‌త్తి మార్కెట్‌లో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన ప‌త్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ర్ట ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి అని అన్నారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా 13 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. అధిక వర్షాల వల్ల పత్తి నల్లబడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రం లో అధికంగా పత్తి పంట వస్తుందని తెలిపారు.

మన రాష్ట్రం లో కూడా సిఎం కెసిఆర్‌ చొరవ‌తో పత్తి రైతులను ఆదుకునేందకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పత్తి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రైవేట్ పత్తి కొనుగోలు వ్యాపారులు సైతం రైతులను కాపాడాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు ద‌గ్గరగా ఇచ్చి కొనాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో పత్తిని కొనాలని జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/