బిజెపియే ఘన విజయం సాధిస్తుంది..శివరాజ్

బిజెపియే ఘన విజయం సాధిస్తుంది..శివరాజ్
Shivraj Singh Chouhan

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో త‌మ పార్టీకి ఓటేసిన‌వారంద‌ర‌కి ఆ రాష్ట్ర సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార బిజెపి ఘన విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. కరోనా భయాన్ని అధిగమించి ప్రజలు పెద్దసంఖ్యలో ఓట్లు వేశారని, ఇది ప్రజాస్వామ్యానికి బల‌మ‌ని చెప్పారు. భారీ ఓటింగ్ వ‌ల్ల బిజెపి ఘ‌న విజయం సాధిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాల‌కు నిన్న ఉపఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 57.09 మంది ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. ఫలితాలను ఈనెల 10న‌ ప్రకటిస్తారు. అత్య‌ధికంగా అగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 80.46 శాతం ఓట్లు న‌మోద‌వ‌గా, సుమౌలీలో 41.79 శాతం ఓట్లు పోల‌య్యాయ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు నిన్న మొత్తం 10 రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌లు జ‌రిగాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/