జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదు – మంత్రి మేరుగ నాగార్జున

జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు మంత్రి మేరుగ నాగార్జున. జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ ఇళ్లను పరిశీలించిన పవన్..వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. వైస్సార్సీపీ అవినీతికి చిరునామాగా మారిందని , జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.12 వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఆరోపణల ఫై వైస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు దీనిపై స్పందించగా..తాజాగా ఈరోజు బుధువారం మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు.

బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ ప్రభుత్వంలో అయినా పవన్ ఇలాంటి కాలనీలు చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారో పవన్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణా వాళ్ల కోసం ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అభివృద్ధికి ఉపయోగపడే వారు.. మోదీనా.. అమిత్ షానా తమకు అనవసం.. రాష్ట్ర అభివృద్దే ముఖ్యమని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అభివద్ది, సంక్షేమ నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. 2024లో జగనా.. చంద్రబాబా తేలుతుందని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.