దుబాయ్ లో గాడ్ ఫాదర్ ఈవెంట్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 05 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈ నెల 28 న అనంతపురం లో ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా జరిపారు. భారీ వర్షం పడినప్పటికీ ఈవెంట్ మెగా సక్సెస్ అయ్యింది. కాగా ఇప్పుడు మరో ఈవెంట్ ను జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మొదట్లోనే అనంతపురం మరియు ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహించాలని భావించారు. అనంతపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్.. ముంబయి ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరు అవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ అనంతపురం యొక్క ఈవెంట్ లో కనిపించలేదు.

ముంబయి లో ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ భద్రత నేపథ్యంలో సాధ్యం కాలేదు. అందుకే ముంబయి వేడుక క్యాన్సిల్ అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుబాయ్ లో భారీ ఎత్తున మెగా ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ వేడుక యొక్క అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.

మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.