కలకలం రేపుతున్న మల్లారెడ్డి ఆడియో టేపు

టికెట్ల కేటాయింపులో మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు రాపోలు

Malla Reddy
Malla Reddy

హైదరాబాద్‌: మేడ్చల్‌ పురపాలక పరిధిలో టిఆర్‌ఎస్‌ టికెట్ల కేటాయింపు రసవత్తరంగా మారింది. నేతల మధ్య విభేదాలు బయటపడి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల వేళ అధికార టిఆర్‌ఎస్‌ పార్టీలో మంత్రి మల్లారెడ్డి ఆడియో టేపు ప్రస్తుతం కలకలం రేపుతోంది. తనకు టికెట్‌ ఇచ్చేందుకు మంత్రి మల్లారెడ్డి రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారని బోడుప్పల్‌ టిఆర్‌నేత రాపోలు రాములు ఆరోపిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారని రాపోలు విమర్శిస్తున్నారు. మల్లారెడ్డి వ్యవహారమంతా పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి చెప్తానని, త్వరలో ఆయన్ను కలుస్తానని ఫోన్‌లో రాపోలు తేల్చి చెప్పారు. టికెట్‌ కోసం తన వద్ద డబ్బు డిమాండ్‌ చేసిన తాలూకు రికార్డులు ఉన్నాయని, వాటిని అధిష్టానానికి చెప్తానని మల్లారెడ్డిని రాపోలు బెదిరించారు. తనపై పోలీసు నిఘా పెట్టినా ప్రజల కోసం తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని రాపోలు వెల్లడించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/