అరగంట పాటు భేటీ అయినా అమిత్ షా – ఎన్టీఆర్

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో వీరిద్దరూ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఎన్టీఆర్‌ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌కు అమిత్ షా పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా.. ఎన్టీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. 20 నిమిషాల పాటు అమిత్ షా, ఎన్టీఆర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం అమిత్‌ షా, కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి భోజనం చేశారు.

వీరిద్దరి భేటీ ఫై బిజెపి నేతలు మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీలో అమిత్ షా సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన నటించిన విశ్వామిత్ర, దానవీరశూర కర్ణ వంటి సినిమాలు తాను చూశానని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులు బాగా పనిచేసేవారన్నారు. అనంతరం షా ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, మన తెలుగు సినిమా తారకరత్నం జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది’’ అని ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.

అంతకు ముందు మునుగోడు సభ లో అమిత్ షా పాల్గొన్నారు. ఉపఎన్నికల్లో బిజెపి ని గెలిచిపించాలని కోరారు. అలాగే టిఆర్ఎస్ సర్కార్ తీరు ఫై నిప్పులు చెరిగారు.