రక్తదానం చేసిన మంత్రి కెటిఆర్

minister-ktr-who-donated-blood

హైదరాబాద్‌ః తెలంగాణ భవన్ లో ఈరోజు బిఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, ఈ కార్యక్రమానికి ఈసీ స్క్వాడ్ అభ్యంతరం తెలిపింది. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని అధికారులు చెప్పారు. అయితే, దీక్షా దివస్ అనేది ఎన్నికల కార్యక్రమం కాదని బిఆర్ఎస్ నేతలు వారికి తెలిపారు. అయినప్పటికీ కార్యక్రమాన్ని ఆపేయాలని అధికారులు చెప్పారు. అయితే రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడానికి మాత్రం అనుమతించారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్ కు కెటిఆర్ చేరుకున్నారు. కెటిఆర్ తో పాటు, పలువురు నేతలు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…. మరోసారి భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు. ఈసారి 88 సీట్లు తమ పార్టీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపెద్ద నాయకులు కూడా ఓడిపోతారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్ మరియు కామారెడ్డి లో కూడా ఓడిపోతాడని బాంబు పేల్చారు. తెలంగాణ ప్రజలంతా గులాబీ పార్టీ వైపు ఉన్నారని స్పష్టం చేశారు.