ఆఫ్ఘనిస్థాన్‌లో ఆకలి చావులు..8 మంది చిన్నారులు మృతి
8 Children Died Of Hunger In Western Kabul, Says Ex-Afghan Lawmaker
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయి. మైనారిటీలపై హింసలు, హత్యల సంగతి పక్కనబెడితే తాజాగా ఆకలి చావులు కూడా వెలుగుచూస్తున్నాయి. పశ్చిమ కాబూల్‌లో హజారా అనే మైనారిటీ సమాజం నివసించే ప్రాంతంలో ప్రజలకు తిండి కరువైపోయింది. చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక అల్లాడుతున్న అక్కడికి జనాల పరిస్థితిని తాలిబన్‌ల హింసలు మరింత దయనీయంగా మారుస్తున్నాయి.
తాజాగా వెస్టర్న్ కాబూల్‌లో హజారా కమ్యూనిటీకి చెందిన 8 మంది చిన్నారులు ఆకలికితో ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ ప్రజాప్రతినిధి మహమ్మద్ మహకిక్ ఆదివారం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాలిబన్‌ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలైన హజారా, షియా కమ్యూనిటీలకు అంతర్జాతీయ సమాజం అండగా నిలువాలని మహమ్మద్ మహకిక్ కోరారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/