ఇందిరాదేవి పార్థివదేహానికి మంత్రి కెటిఆర్ నివాళి

Minister KTR pays tributes to Mahesh Babu’s mother Indira Devi

హైదరాబాద్‌ః సినీ నటుడు మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కెటిఆర్ నివాళి అర్పించారు. మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, ఇందిరాదేవి మృతిపట్ల సంతాపాన్ని తెలియజేశారు. నాగార్జున, మోహన్ బాబు, గోపీచంద్, అల్లు అరవింద్ తదితరులు కూడా నివాళి అర్పించారు. ఈ తెల్లవారుజామున ఆమె అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఇందిరాదేవి అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/