రెండో రోజు ఈడీ విచారణ హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

manchireddy-kishan-reddy-interrogation-on-the-second-day-at-the-ed-office

హైదరాబాద్‌ః ఇబ్రహీంపట్నం టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన హాజరయ్యారు. నిబంధనలు ఉల్లఘించి విదేశాలకు నిధులు మళ్లించారనే అరోపణలపై మంగళవారం దాదాపు 9 గంటలపాటు విచారించిన అధికారులు… వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఆస్ట్రేలియా, సింగపూర్​లకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై… మంచిరెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. ఆయన బ్యాంకు ఖాతాలు పరిశీలించిన అధికారులు కొన్ని లావాదేవీలపై ఆరా తీశారు.

ఢిల్లీ మద్యం కేసులో రాష్ట్రంలో పలుచోట్ల వరుసపెట్టి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పిలిపించి ప్రశ్నిస్తుండటం ప్రాధాన్యం సతరించుకుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఈడీ అధికారులు నిరాకరిస్తున్నారు. కేసు నమోదు కాలేదని, ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే ఆయనను మౌఖికంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇందులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా అవసరమైతే ఈడీ అదికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/