కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్
minister-ktr-pays-solid-tribute-to-konda-laxman-bapuji
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నార్మక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను కేటీఆర్ స్మరించుకున్నారు. తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/