తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి చైనా 30 యుద్ధ విమానాలు

బీజింగ్: తైవాన్, చైనా మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం మొదలైంది. తైవాన్ వైమానిక దళంలోకి చైనా 30 యుద్ధ విమానాలను పంపినట్లు తెలుస్తోంది. అయితే చైనా చర్యకు దీటుగా యుద్ధ విమానాలను మోహరించినట్లు తాజాగా తైవాన్ వెల్లడించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తైవాన్ విషయంలో చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే. తైవాన్ పరిసర ప్రాంతాల్లో చైనా తన వైమానిక కార్యకలాపాలను పెంచింది.
అయితే సైనిక శిక్షణ చేపడుతున్నట్లు ఆ దేశం చెబుతున్నా.. తైవాన్ మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తైవాన్ వైమానిక రక్షణ క్షేత్రంలో ఉన్న ప్రటాస్ దీవుల వద్దకు చైనా యుద్ధ విమానాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంట్లో 22 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. తమ వైమానిక క్షేత్రంలోకి చైనా విమానాలు వస్తున్నట్లు చాన్నాళ్ల నుంచి తైవాన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/