నిర్భయ దోషులకు కొత్త ఉరిశిక్ష తేదీ ఖరారు

Trail-court-issue-death-warrent-for-nirbhaya-convicts
Trail-court-issue-death-warrent-for-nirbhaya-convicts

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు తేదీ ఖరారైంది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు ముకేశ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ను ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ మేరకు పాటియాలా హౌస్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయడం ఇది మూడోసారి. దోషులకు న్యాయపరమైన అవకాశాలు పెండింగ్‌లో ఉన్నందున గతంలో జారీ అయిన రెండు డెత్ వారెంట్లపై కోర్టు స్టే విధించింన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది పాటియాలా కోర్టు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/