సోనూసూద్ కు రెండు పార్టీలు ఆఫర్లు ఇస్తున్నాయట

రియల్ హీరో సోనూసూద్ తనకు రెండు రాజకీయపార్టీల నుండి రాజ్యసభ స్థానాల ఆఫర్లు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రీసెంట్ గా సోనూసూద్ ఆస్తులపై ఐటి అధికారులు ఆరా తీసిన సంగతి తెలిసిందే. సోనూ ఇంటి తో సహా తన ఆఫీస్ లలో ఐటి రైడ్స్ జరిపి..దాదాపు రూ. 20 కోట్ల వరకు పన్ను కట్టలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను మరోసారి ఖండించారు సోనూసూద్.

తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినన్న ఆయన.. తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో చేరేందుకు మానసికంగా సిద్ధంగా లేనందున వాటిని నిరాకరించినట్లు ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు తానే స్వయంగా బహిరంగంగా వెల్లడిస్తానని సోనూసూద్‌ స్పష్టం చేశారు.