మరోమారు ఇంటింటి సర్వే

కెసిఆర్‌ ప్రభుత్వం నిర్ణయం

house survey in TS

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న కెసిఆర్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలో గల ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఒక నివేదిక తయారు చేయాలని, దీనికోసం రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేయాలని తలచింది. ఈ సర్వేను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనుంది. దీనికోసం రాష్ట్రంలోని 27 వేల మంది ఆశావర్కలను, అలాగె 8 వేల మంది ఏఎంఎలను ఉపయోగించుకోనుంది. ఈ సర్వే మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని, జ్వరం, దగ్గు, జలుబు, తదితర లక్షణాలున్న వారి వివరాలతో ఒక రిపోర్ట్‌ను తయారు చేస్తారని, కరోనా వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా ఈ సర్వే జరుగుతుందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/