నారాయణపేటలో బిఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించి కెటిఆర్‌

minister-ktr-inaugurates-brs-party-office-at-narayanpet

నారాయణపేటః రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కెటిఆర్‌ నారాయణపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. మొదట సింగారం వద్ద బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి కెటిఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు సీటులో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

అంతకు ముందు కెటిఆర్‌ పార్టీ కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు. పర్యటనలో భాగంగా మంత్రులు సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. సమీకృత మార్కెట్‌, సఖీ కేంద్రాన్ని మంత్రులతో కలిసి కెటిఆర్‌ ప్రారంభోత్సవం చేస్తారు. కొండారెడ్డిపల్లి చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌, సీనియర్‌ సిటిజన్‌ పార్క్‌కు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/