ఒడిశా రైలు విషాదం.. బాధిత కుటుంబాల‌కు సంతాపం తెలిపిన మంత్రి కెటిఆర్

minister-ktr

హైద‌రాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కెటిఆర్ ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించారు. ఆ దుర్ఘ‌ట‌న‌లో 233 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల ఆయ‌న షాక్ వ్య‌క్తం చేశారు. రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం తెలిపారు. ప్ర‌మాద బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైలు ప్ర‌మాదాన్ని నివారించే యాంటీ కొలిజ‌న్ డివైస్‌లు ఏమైన‌ట్లు మంత్రి కెటిఆర్ ప్ర‌శ్నించారు. ప్ర‌మాద తీవ్ర‌త చాలా ఊహించ‌ని రీతిలో ఉంద‌ని, ఈ విషాదం జ‌ర‌గాల్సింది కాదు అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.