భద్రాద్రి : బూర్గంపాడు లో నాటు పడవ బోల్తా

,

బూర్గంపాడు లో నాటు పడవ బోల్తా పడింది. గోదావరి వరద కారణంగా బూర్గంపాడు లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో నాటుపడవ బోల్తా పడింది. 10 మందిని పడవలో సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తుండగా ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. 9 మందిని రక్షించగా..మరొకరు మిస్ అయ్యారు. ప్రస్తుతం అతడి కోసం గాలింపు చేస్తున్నారు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో భద్రాద్రిలో గోదావరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఫలితంగా గోదావరి తీరప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.

ముంపు బాధితులు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటుండగా.. ఇళ్ల వద్దే ఉన్న బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జులై మొదటిపక్షంలోనే ఈ స్థాయిలో వరదపోటెత్తడం గోదావరి చరిత్రలోనే ఇది రెండోసారి. ఇక గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 71 అడుగుల మేర ప్రవహిస్తుంది. మరికొన్ని గంటల్లో ఉదృతి భారీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1976లో తొలిసారి భద్రాచలం వద్ద 63.9 అడుగుల నీటిమట్టం జూన్ 22న నమోదైంది. ఆ తర్వాత 36 ఏళ్లలో 70 అడుగులు దాటడం ఇదే ప్రథమం. ఒకవేళ 75 అడుగులు దాటితే.. 50 ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుంది. ఇప్పటివరకు ఆరుసార్లు 60 అడుగులు, రెండుసార్లు 70 అడుగులు క్రాస్ అయింది.