పంటపొలాలలో పెద్దపులి సంచారం

భయాందోళనలో గ్రామస్థులు

tiger
tiger

మంచిర్యాల: జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయబ్రాంతుకు గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా జనాలు ఇళ్లకే పరిమితం కావడంతో జంతువులు గ్రామలలోకి వస్తున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా తాండురు మండలం గోపాలరావుపేట గ్రామ శివార్లలో పులి సంచరిస్తుడడం అక్కడి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో పంట పొలాలకు వెళ్లడానికి జనం భయపడుతున్నారు. కొందరు గ్రామంలో పుతి సంచరిస్తున్న విషయాన్ని అటవిశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న అధికారులు పులిని బందించి అటవికి తరలించేందుకు చర్యలు చేపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/