సూర్యాపేటలో కరోనా లింక్‌ కట్‌ చేయాలి

సిఎం కెసిఆర్‌ ఆదేశం

shanitaization in suryapet
shanitaization in suryapet

సూర్యాపేట: జిల్లాలో ఒక్కరోజులోనే ఏకంగా 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 78 కి చేరింది. అదికాక రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు జిహెచ్‌ఎంసి తరువాత సూర్యాపేట జిల్లాలోనే ఉండడంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేటపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది. సూర్యాపేటలో మర్కజ్‌ ప్రార్దనలకు వెళ్లి వచ్చిన వారు అధికంగా ఉండడం, వారంతా నిత్యవసరాల వాపారంలో ఉండడంతో కాంటాక్ట్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వైరస్‌ లింక్‌ కట్‌ చేయాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు నేడు సూర్యాపేటలో సిఎస్‌, డిజిపి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, వైద్యసిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/