జడ్‌ఎస్‌ ఈవీ ఎలక్ట్రిక్‌ కారు మార్కెట్లోకి

mg-zs-ev-launched-in-india
mg-zs-ev-launched-in-india

న్యూఢిల్లీ: హెక్టర్‌ మోడల్‌తో భారత్‌లో ప్రవేశించి వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఎంజీ మోటార్స్‌ జడ్‌ఎస్‌ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి భారత్‌ మార్కెట్లోకి వచ్చి తొలి విద్యుత్‌ ఎస్‌యూవీ ఇదే. రెండు వేరియంట్లలో ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్సైంట్‌ వేరియంట్‌ కారు ధర రూ. 20.88 లక్షలు కాగా..ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌ ధర రూ. 23.58 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, అహ్మదబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌లో మాత్రమే ఈ కారును విడుదల చేశారు. ఈ కారులో 44.5 కిలోవాట్స్‌ శక్తి ఉన్న బ్యాటరీని అమర్చారు. దీన్ని ఒకసారి రీఛార్జి చేస్తే 340 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉంది. 40 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఆఫిస్‌, ఇంట్లో ఛార్జి చేసుకోవడానికి 7.4 కిలోవాట్ల హోం ఛార్జర్‌ను ఎంజీ అందజేస్తుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/