ఈ నెల 27న మేయర్లు, చైర్మన్ల ఎన్నిక

telangana municipal corporation
telangana municipal corporation

హైదరాబాద్‌: తెలంగాణలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలను జనవరి 25న వెల్లడిస్తారు. ఈ క్రమంలో మేయర్లు, ఛైర్‌ పర్సన్ల ఎంపికకు సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ జారీ అయింది. జనవరి 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మధ్యాహ్నం మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. దీనికి సంబందించిన నోటీసును జనవరి 25న జారీ చేయనున్నారు అధికారులు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి 24 జరగనుండగా.. ఫలితాలు 27న వెల్లడిస్తారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/