పారిశ్రామికవేత్తలకు పద్మ అవార్డులు

venu-srinivasan-and-anand-mahindra-conferred-padma-bhushan
venu-srinivasan-and-anand-mahindra-conferred-padma-bhushan

న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వాణిజ్య, పారిశ్రామిక రంగా ల నుంచి మొత్తం 11 మందికి ఈ అరుదైన గౌరవం లభించింది. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీం ద్రా, టీవీఎస్‌ గ్రూప్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌కు పద్మభూషణ్‌ దక్కగా.. మరో 9 మందికి పద్మశ్రీ లభించింది. పద్మశ్రీ దక్కిన వారిలో ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ చైర్మన్‌ ప్రేమ్‌ వత్స, నౌకరీ డాట్‌ కామ్‌ వ్యవస్థాపకులు సంజీవ్‌ బిఖ్‌చందానీ, టాలీ సొల్యూషన్స్‌కు చెంది భరత్‌ గోయెంకా, సింఫనీ టెక్నాలజీ చీఫ్‌ రోమేష్‌ వాద్వానీ కూడా ఉన్నారు. కాగా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా. ప్రస్తుతం మహీంద్రా గ్రూప్‌ కార్లు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల తయారీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, ఆతిథ్యం, ఏరోస్పేస్‌, రక్షణ, అగ్రిబిజినెస్‌, నిర్మాణ యంత్రాలు, పారిశ్రామిక యంత్రాల తయారీ, లాజిస్టిక్‌, రియల్‌ ఎస్టేట్‌, రిటైల్‌ వ్యాపారాల్లో ఉంది. 1981లో మహీంద్రా గ్రూప్‌లోని ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా చేరిన ఆనంద్‌ మహీంద్రా.. అంచెలంచెలుగా ఎదుగుతూ 2012 ఆగస్టులో తన మామయ్య కేశుభ్‌ మహీంద్రా నుంచి గ్రూప్‌ చైర్మన్‌ బాధ్యతలను చేపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/