కూరలు వండే విధానం

Method of cooking vegetables

బంగాళాదుంపలు చిన్న ముక్కలు కోసి ఉడికించకూడదు. అలా చేస్తే వాటిలోని పోషక విలువలు పోతాయి. అందుకే బంగాళాదుంపల్ని బాగా కడిగి మధ్యగా కోసి పొట్టుతో ఉడికించాలి. అలా చేయడం వల్ల దుంపల పొట్టులో ఉండే పీచు పోదు.

ఇతర పోషకాలు అందుతాయి. క్యాబేజీ చాలా మంది ఉడికించి కూర చేస్తారు. ఇలా ఉడికించినప్పుడు శరీరానికి మేలు చేసే గుణాలన్నీ వృథాగా పోతాయి. అందుకే దీన్ని ఉడికించేప్పుడు నీళ్లలో నూనె లేదా కాస్త వెన్న వేయాలి. అప్పుడే పోషకాలు పోవు. క్యాబేజీని అతిగా ఉడికించినా, వేపినా సల్ఫర్‌ విడుదలై రుచి మారే ప్రమాదముంటుంది. సలాడ్లు, బర్గర్లు, శాండ్‌విచ్‌ వంటి వాటిల్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తుంటారు. నిజానికి ఇది మంచి పద్ధతి. పచ్చి వాటిల్లో సల్ఫర్‌ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జీవక్రియ రేటును పెంచుతుంది. కాబట్టి వాటిని వేయించకూడదు. మాంసం, చేపలు ఎక్కువ మంట మీద ఉడికిస్తే మాంసకృత్తులు పోతాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/