ఉదయాన్నే నడక.. ఉత్సాహం

Morning Walking

ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపు ఓ పావ్ఞగంట బెడ్‌రూమ్‌లోనే బాడీని రిలాక్స్‌ చేయగలగాలి. ఒకవిధంగా ఇది చిరు వ్యాయామమే అయినా నిద్ర మత్తు వదలి ఆక్టివేట్‌ అవ్ఞతాం. వివాహితులు భాగస్వామితో కబుర్లు చెప్పుకుని మంచం దిగవచ్చు. రూమ్‌మేట్స్‌ నాలుగు మాటలతో నిద్రకు స్వస్తి పలకవచ్చు.

ఆదివారం కదాని చాలామంది మహిళలు ఉదయాన్నే నిద్ర లేవరు. నిజమే వారమంతా కష్టపడి పనిచేసి, కనీసం ఆదివారమైనా ఓ గంటసేపు అదనంగా నిద్రపోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ వాకింగ్‌ చేసేవారికి ఇదేమీ అనిపించదు. వాకింగ్‌ చేయాల్సిందే అనుకుంటారు. ఆకసాన చంద్రుడు నడినెత్తి మీదకొచ్చి వాతావరణాన్ని చల్లబరుస్తున్నప్పుడు నిద్రకు ఉపక్రమిస్తే ఓ ఆరుగంటల సంపూర్ణ నిద్రతో ఉదయం ఆరింటికల్లా సూర్యుడితో పాటు మనమూ నిద్రలేవవచ్చు. ఈ అలవాటే ఎంతో ఆరోగ్యకరమైనది.

ఇలా పద్ధతిగా లేస్తూ సూర్యోదయంతో మన దినచర్య ప్రారంభమైతే ఆరోజంతా ఉల్లాసమూ, ఉత్సాహమే. ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపు ఓ పావుగంట బెడ్‌రూమ్‌లోనే బాడీని రిలాక్స్‌ చేయగలగాలి. ఒకవిధంగా ఇది చిరు వ్యాయామమే అయినా నిద్ర మత్తు వదలి ఆక్టివేట్‌ అవ్ఞతాం. వివాహితులు భాగస్వామితో కబుర్లు చెప్పుకుని మంచం దిగవచ్చు.

రూమ్‌మేట్స్‌ నాలుగు మాటలతో నిద్రకు స్వస్తి పలకవచ్చు. అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఇదే పద్ధతిని పాటించడం మంచిది. ఆ తర్వాత పదిహేను నిమిషాలు కాలకృత్యాలకు బ్రషింగ్‌తో బయటపడాలి. మరో తర్టీ మినిట్స్‌ మార్నింగ్‌ వాక్‌కి లేదా గార్డెనింగ్‌కి ఈ సమయంలో మనసును గందరగోళ పరచకుండా చక్కటి సంగీతం వింటూ మానసికంగా రిలీఫ్‌ పొందాలి. ఈ వాక్‌ వల్ల మనసూ, దేహమూ ఆక్టివేట్‌ అవ్ఞతాయి.

భార్యతోను, పిల్లలతోను వాకింగ్‌కి వెళ్లగలిగితే మరీ మంచిది.
వారితో గడిపినట్టూ అవ్ఞతుంది. లేదా సరదాగా ఉండే స్నేహితులతో మార్నింగ్‌ వాక్‌ ముగించవచ్చు. వాకింగ్‌కి వెళ్లనివారు జిమ్‌కి వెళ్లే సమయం ఇదే. త్రెడ్‌మిల్‌ పైన వాక్‌ చేయాలన్నా, ఆసనాలు వేయాలన్నా ఈ అరగంటా చాలు. పావ్ఞ గంట స్నానం.

ముప్పయి నిమిషాలు ధ్యానం లేదా పూజ.
పదిహేను నిమిషాలు కేవలం వార్తలకే. చదివినా, విన్నా, చూసినా ఒక్కటే.ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఫిఫ్టీన్‌ మినిట్స్‌ ఎడ్యుకేట్‌ చేసే పత్రికా వ్యాసాలు, జర్నల్స్‌, మాగ్యజైన్స్‌ చదవటం, దీనివల్ల మన వృత్తి జీవనానికి సంబంధించిన అనేకానేక విషయాలు తెలుస్తుంటాయి. చోటు చేసుకుంటున్న కొత్త దృక్పథాలపై దృష్టి పెట్టవచ్చు.

సమస్యా పరిష్కారానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. సమర్థవంతంగా కార్యమగ్నం కావటానికి మరిన్ని మెలకువ లు తెలుస్తుంటాయి. ఓ పావ్ఞగంట దినచర్యను ప్లాన్‌ చేసుకోవాలి. ఎంగేజ్‌ మెంట్స్‌ బుక్‌ కానీ, నోట్‌పాడ్‌ కానీ దీనికి అనుకూలంగా ఉంటుంది. ఓ పావ్ఞ గంట అల్పాహారం-బ్రేక్‌ఫాస్ట్‌ మరో పావ్ఞగంట రెడీ కావటానికి. బ్రేక్‌ఫాస్ట్‌, రెడీ అయ్యే అరగంట సమయాన్ని ఫ్యామిలీతో గడపాలి. కలిసి ఉపాహారం తీసుకోవటం వల్ల సరదాగాను ఉంటుంది.

రిలీఫ్‌గాను ఉంటుంది. కుటుంబంతో గడిపామన్న సంతృప్తీ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్ల ప్రకారం నూనెను ఎంత తక్కువ మోతాదులో ఉపయోగిస్తే అంత మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో ‘హౌ టు బి ప్రొడక్టివ్‌ అండ్‌ ప్రొమోట్‌ క్రియేటివిటీ అన్న విషయ ప్రధానంగా కుటుంబంతో మాటామంతీ సాగాలి. ఇక

డ్రస్‌అప్‌-ఆనాటి దినచర్యకు అనుగుణంగా వస్త్రధారణ ఉండాలి. కలిసే వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని రెడీ కావాలి. కేవలం పనికే పరిమిత మైనపుడు డ్రస్‌అప్‌ సింపుల్‌గా ఉంటే కంఫర్టబుల్‌ గా ఉంటుంది.
కొత్తవారిని కలవటానికి వెళ్లేటపుడు ఎంత ఉత్సాహంగా, ఎంతలా డ్రస్‌సెన్స్‌తో ఉంటామో అలా ప్రతీరోజు ఉండగలగటం వల్ల నీరస స్వభావం చోటు చేసుకోదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/