ఢిల్లీ పాఠశాలలో మెలానియా ట్రంప్‌

సాదర స్వాగతం పలికిన పాఠశాల సిబ్బంది

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ భారత్‌ పర్యటనలో నేపథ్యంలో ఢిల్లీలోని సర్వోదయ కో-ఎడ్యూకేషన్‌ సీనియర్‌ సెకండరీ పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా అక్కడి చేరుకున్న మెలానియా ట్రంప్‌కు పాఠశాల సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అనంతరం చిన్నారులు విచిత్ర వేషధారణలో రావడం గమనించిన మెలానియా వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. అంతేకాదు, హ్యాపీనెస్ క్లాస్ లోనూ ఆనందోత్సాహాలు ప్రదర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/