చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి

సిద్దిపేటలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నిరహారదీక్ష

komatireddy venkat reddy
komatireddy venkat reddy

సిద్దిపేట: చేర్యాల మున్సిపాలిటీ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని చేర్యాల పాత బస్టాండ్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాహారదీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకుని ఎంపీకి చేర్యాల కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పూలవేసి నివాళులర్పించిన అనంతరం ఎంపీ దీక్షను ప్రారంభించారు. కోమటిరెడ్డి దీక్షకు వామపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వర్తక ,వాణిజ్య వ్యాపారస్తులు సంఘీభావం తెలిపారు. దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్‌లు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుండి రేపు ఉదయం 10 గంటల వరకు 24 గంటల పాటు కోమటిరెడ్డి దీక్ష కొనసాగనుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/