ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అస్వస్థత

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని తన నివాసంలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. ఇప్పుడేమీ మాట్లాడలేనని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైకి తరలించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించిన చంద్రశేఖర్‌రెడ్డి గుండెలో రెండు వాల్వులు బ్లాక్‌ అయినట్లు గుర్తించారు. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి తరలించారు. అక్కడ చంద్రశేఖర్ రెడ్డి కోలుకున్నారు.

ఇక ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురి కావడం తో ఆయన అనుచరులు , కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటె రీసెంట్ గా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సస్పెండ్ చేయడం తో ఆయన ఫై నియోజకవర్గం ఫై వ్యతిరేకత ఎక్కువైంది. వైస్సార్సీపీ శ్రేణులు , నేతలు ఆయన దిష్టి బొమ్మలను తగలబెట్టడం , ప్లెక్సీ లు చించేయడం చేస్తూ , ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.