జూబ్లీహిల్స్ లో మరో దారుణం..భార్య ను చంపి డ్రమ్ములో దాచిన భర్త

అత్యాచారాలకు , రోడ్డు ప్రమాదాలకు , డ్రగ్స్ కు ఇలా ప్రతి నేరానికి జూబ్లీహిల్స్ కేరాఫ్ గా మారుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటన వార్తల్లో నిలుస్తుండగానే మరో దారుణం బయటపడింది. కట్టుకున్న భార్య ను అతి కిరాతకంగా చంపి డ్రమ్ములో దాచిపెట్టిన ఘటన ఇప్పుడు వార్తల్లో హైలైట్ గా నిలుస్తుంది.

వివరాల్లోకి వెళ్తే..

జూబ్లీహిల్స్ లోని ఎస్‌పీఆర్ హిల్స్‌ లో నివాసం ఉండే ఓ వ్యక్తి..తన రెండో భార్య ను అతి కిరాతకంగా చంపి , బాడీ ని రెండు ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టి.. దానిపై దుస్తులు కప్పి వెళ్లిపోయాడు. ఇంట్లో నుండి దుర్వసన రావడం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటాల స్థలానికి వచ్చి డీడీ బాడీ ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితమే చంపి ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. కాగా, 2020లోనే నిందితుడు తన మొదటి భార్యను హతమార్చాడని పోలీసులు పేర్కొన్నారు. రెండో భార్యను ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే హంతకుడని గాలింపు చేపట్టారు.