డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మెహ్రీన్ కు మరో ఛాన్స్ ఇచ్చాడా..?

రైటర్ గా చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి…పటాస్ మూవీ తో డైరెక్టర్ గా మరి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్..ఈ నెల 27 న ఎఫ్ 3 మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటె ..ఈ మూవీ రిలీజ్ తర్వాత బాలకృష్ణ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహ్రీన్ ను ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ కథ తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరుగుతుందనీ, కూతురు పాత్రలో శ్రీలీల చేయనుందని అంటున్నారు. ఈ సినిమాలో తన మార్కు కామెడీ తక్కువగా ఉంటుందనీ, బాలయ్య మార్కు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిల్ రావిపూడి చెపుతున్నాడు. కాగా అనిల్ తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కువ శాతం హీరోయిన్ గా మెహ్రీన్ ను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ అవుతూ వస్తున్నాడు. అందుకే ఆమెను గోల్డెన్ హీరోయిన్ గా ఆయన ఫిక్స్ అయ్యి..తన ప్రతి సినిమా లో హీరోయిన్ గా తీసుకుంటూ వస్తున్నాడు.