ఒకే ఒక్క కరోనా కేసు..నగరమంతటా లాక్డౌన్
Corona
కాన్బెరా: ఒకే ఒక్క కరోనా కేసు నమోదు కావడంతో అస్ట్రేలియాలోని పెర్త్ నగరమంతటా ఐదు రోజులపాటు లాక్డౌన్ విధించారు. పెర్త్ నగరంలో ఉన్న ఓ క్వారంటైన్ హోటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు చేపట్టారు. ఆదివారం నుంచి 5 రోజులపాటు నగరంలో లాక్డౌన్ విధించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ప్రజలను అనుమతిస్తున్నారు. సోమవారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం కూడా వాయిదా పడింది. క్వారంటైన్ హోటల్లో విడిది చేసిన వ్యక్తి నుంచి సెక్యూరిటీ గార్డుకు వైరస్ సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/