బలగం చిత్ర యూనిట్ ను సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు మరోసారి రుజువైంది. తన సినిమాలే కాదు చిత్రసీమలో అందరి హీరోల సినిమాలు విజయాలు సాదించాలి…చిన్న , పెద్ద చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాదించాలని కోరుకుంటుంటారు. ఏ సినిమా విజయం సాధించిన సరే ఆ చిత్ర యూనిట్ ను అభినందిస్తుంటారు. తాజాగా బలగం చిత్ర యూనిట్ అలాగే అభినందించి , సత్కరించారు.

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన బలగం మూవీ గత వారం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ వేణు ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చాలామంచి సినిమా తీశావని, ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే బలగం సినిమాని చూసిన చిరంజీవి.. భోళా శంకర్ సెట్స్ లో బలగం చిత్ర బృందంతో సందడి చేశారు. వారిని అభినందించి సన్మానం చేశారు. అంత మంచి సినిమా తీసి మాకు షాకిస్తే ఎలా అంటూ వేణుని ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ సంస్కృతిని బాగా చూపించావంటూ పొగిడేశారు. వేణు ను ,అలాగే హీరో ప్రియదర్శి కి చిరంజీవి శాలువా కప్పి సన్మానం చేశారు. టీమ్ అందరినీ మంచి సినిమా తీశావంటూ పొగిడేశారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.