బండి సంజయ్ కి నోటీసులు పంపిన మహిళా కమిషన్

bandi-sanjay

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితక్కను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా ? అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలఫై యావత్ బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం టీచర్ల సమావేశంలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో బిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు బండి సంజయ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ ఫై పిర్యాదు లు చేస్తున్నారు.

అలాగే బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. దీంతో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా బండి సంజయ్ కమిషన్ ముందు హాజరు కావాలని కోరింది. ఉదయం నుండి బిఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో ముందస్తు భద్రత పెంచారు పోలీసులు. బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. కార్యాలయానికి వచ్చే రెండు దారుల వద్ద భారీకేట్లను ఏర్పాటు చేశారు.