మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 15 గేట్లు ఎత్తివేత

జయశంకర్‌ భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్ కి ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. దీంతో ఈ ఉదయం అధికారులు బ్యారేజీ 15 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 31,100 క్యూసెక్కులుగా ఉంది. అలాగే 16.17 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుత నీటిమట్టం 11.679 టీఎంసీలుగా నమోదు అయ్యింది. . మహారాష్ట్రలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి దాదాపు 53 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/