ఘనంగా జగన్ ఏడాది పాలన వేడుకలు

పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ‘సజ్జల’

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

Amaravati: వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారంనాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు,పార్టీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  రాష్ర్ట విభజన తర్వాత చరిత్రగతిని మార్చే పాలన ప్రారంభమై ఏడాది పూర్తి  అయ్యిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉండటమే అదృష్టంగా భావితరాలు భావించేలా జగన్ పాలన ఉందని పేర్కొన్నారు. 

ఈ ఏడాదిలో ఏమి జరిగిందనేది గత వారం రోజులుగా ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు..

ఆయన స్వయంగా కూర్చుని కీలకఅంశాలు,మౌళిక అంశాలపై ఇప్పటివరకు ఏం చేశాం,ఇకపై ఏం చేస్తే బాగుంటుందనే విధంగా సలహాలు తీసుకుంటూ చర్చలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.

రాజశేఖరరెడ్డి బిడ్డగా ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న నాయకుడిగా ప్రజలు  అభిమానాన్ని పొందిన జగన్  బాధ్యతగా  పని చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు.

ఏడాది పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమనికి పెద్ద పీట వేశారనీ, కరోనా మహమ్మారి  నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/