రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శం

రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ : విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి నల్లగొండ మండలం ఖాజీ రామారం, తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లి, పజ్జురు గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. అలాగే తిప్పర్తిలో సహకార సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమన్నారు. సాగులో రైతుల కష్టాలను పరిష్కరించుకునేదుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రాంచంద్ర నాయక్, జెడ్పీ ఫ్లోర్ లిడర్ పాశం రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి పాల్గొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/