ప్రత్యేక గదిలో చంద్ర బాబుకు వైద్య పరీక్షలు

గంటపాటు ప్రభుత్వ వైద్యశాల లోనే..

Medical tests for Chandra Babu

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.. ఆదివారం తెల్లవారుజామున బాబును ఎసిబి కోర్టుకు హాజరు పరిచే నిమిత్తం ఆయన్ని ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక గదిలో చంద్ర బాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను 30 మంది వైద్యులు చంద్ర బాబుకు పరీక్షలు జరుపుతున్నారు. ఈమేరకు గంటపాటు ప్రభుత్వ వైద్యశాలలో చంద్ర బాబు ఉండనున్నారు .

జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/