మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

Medaram hundi counting
Medaram hundi counting

వరంగల్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం మహా జాతర హుండీల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. సుమారు 200 మంది సిబ్బందితో 494 హుండీలను లెక్కించనున్నారు. హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు కొనసాగుతోంది. హుండీల లెక్కింపు ప్రదేశంలో సీసీ కెమెరాలు, పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశామని దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. జాతరలో సమ్మక్క గద్దె వద్ద 202, సారలమ్మ గద్దె వద్ద 202, గోవింద రాజు గద్దె వద్ద 25 హుండీలు, పగిడిగిద్దరాజు గద్దె వద్ద 28, 38 బట్ట హుండీలను అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/