పూరీ జగన్నాథుడి రథయాత్రకు సుప్రీం అనుమతి

భక్తులు లేకుండా నిర్వహించాలంటూ ఆదేశం

పూరీ జగన్నాథుడి రథయాత్రకు సుప్రీం అనుమతి
puri-jagannath-rath-yatra-supreme-court

న్యూఢిల్లీ: పూరీ జగన్నాథుడి రథయాత్రకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రథయాత్రకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఈ యాత్రలో భక్తులు పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రథయాత్ర నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం తరుపు న్యాయవాది హరీశ్ సాల్వే వాదిస్తూ… రథయాత్ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో రేపటి నుంచి పూరీ జగన్నాథ్ రథయాత్రను నిర్వహించనున్నారు.  రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.  పెద్దసంఖ్యలో భక్తులు రాకుండా చూసుకోవాలని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడరాదని స్పష్టం చేసింది. జూన్‌ 18న ఇచ్చిన తీర్పును సవరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/