‘సేవా కార్యక్రమాలు అభినందనీయం’

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Service programs are commendable-Venkaiah Naidu
Venkaiah Naidu

Vijayawada : విజయవాడ సమీపంలోని ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ ప్రాంగణంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరుపేద మహిళలకు ఆర్థిక స్వావ‌లంబన కోసం కుట్టుమిషన్లు, గ్రామాల్లోని పేదల స్వయం ఉపాధిలో భాగంగా నిరుపేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థినీ, విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ…. చేతన ఫౌండేషన్ సేవలను అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అభిలాషించారు. విదేశాల్లో ఉండి భారతదేశంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనిగళ్ళ రవి, రేణుక దంపతులను, ఉప్పుటూరి రాంచౌదరిని అభినందించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనిగళ్ళ రవి, ఫోర్ట్ లాండ్, యూఎస్ఏ, చేతన ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు వెనిగళ్ళ వెంకటేశ్వరరావు, ఫౌండేషన్ సభ్యులు ఉప్పుటూరి మహాలక్ష్మి, ముత్తినేని సురేష్, మోతుకూరి నారాయణ రావు, చంద్రకాని నవీన్, పాల్గొన్నారు.

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/