భారత్‌ పర్యటనలో ఎన్నో అనుభూతులు

ప్రధాని నరేంద్ర మోడిపై ప్రశంసలు కురిపించిన ట్రంప్‌

Donald Trump
Donald Trump

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన పర్యటనను గుర్తు చేసుకుంటూ నరేంద్ర మోడిపై పొగడ్తలు కురిపించారు. భారతీయులు ఎంతో అభిమానించే ఓ గొప్ప వ్యక్తి మోడి అని అన్నారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన, భారత పర్యటన తనకు ఎన్నో అనుభూతులను మిగిల్చిందని అన్నారు. దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు హాజరైన మొతేరా స్టేడియం సభను గురించి ప్రస్తావించారు. భారత ప్రజలు ప్రేమించే గొప్ప వ్యక్తి నరేంద్ర మోడితో కలిసి నేను ఓ అద్భుతాన్ని చూశాను. అదే ఇక్కడ సమస్యగా మారింది. ఇక్కడి సభకు ఎంతో మంది వచ్చారు. సాధారణంగా నేను నా ప్రసంగాల్లో వచ్చిన ప్రజల గురించి మాట్లాడతాను. కానీ, ఇంకెవరి సభకూ రానంత మంది ఇండియాలో నా సభకు వచ్చారు. నా సభలకు 60 వేల మంది వరకూ హాజరైన సందర్భాలున్నాయి. ఇండియా సభను చూసిన తరువాత వచ్చిన క్రౌడ్ గురించి ఇక ఎక్సయిట్ అవను. ఆ దేశ ప్రజలు ఎంతో ప్రేమను చూపించారు. వారికి ఓ గ్రేట్ లీడర్ ఉన్నారు. అహ్మదాబాద్ ర్యాలీ ఎంతో విజయవంతమైంది అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/