3 రోజులపాటు బంగ్లాదేశ్ లో పర్యటన

Indian PM Narendra Modi, Sheikh Hasina (File)

New Delhi: ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 16 నుంచి 18వ తేదీ వరకూ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోడీ విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపనున్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 16న ప్రధాని మోడీ ఢాకా చేరుకుంటారు. 17న షేక్ ముజిబుర్ రెహమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు సన్నాహకాలుగా మార్చి తొలివారంలో విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్దన్ ష్రింగ్లాం బంగ్లాదేశ్ పర్యటిస్తారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/