శ్రీశైలం అడవిలో అలుముకున్న మంటలు

Fire breakes in srisailam forest
Fire breakes in srisailam forest

కర్నూలు: శ్రీశైలం బిముణికొలను అడవి ప్రాంతంలో భారీగా మంటలు చలరేగుతున్నాయి. దీంతో పాదయాత్రగా శ్రీశైలం వెళ్తున్న శివస్వాములు, భక్తులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. బీముణికొలను అడవి మీదుగా శివ భక్తులు పాదయాత్రగా వెళ్తున్నారు. అడవిలో మంటలు అలముకోవడంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఘటనపై అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే భక్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు శివస్వాములు భారీగా పాదయాత్రతో శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/