వీధి కుక్కల విషయంలో అక్కినేని అమల ఆసక్తికర కామెంట్స్ ..?

వీధి కుక్కల విషయంలో బ్లూక్రాస్‌ సోసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నిర్వహకురాలు, నటి అమల అక్కినేని ఆసక్తికర కామెంట్స్ చేసారు. వీధి కుక్కల దాడుల్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో మనుషులు గాయపడుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా పెద్ద అంబర్ పేట్ లో నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. దీంతో వీధి కుక్కల కట్టడికి ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల విషయంలో జంతు ప్రేమికులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

ప్రముఖ యాంకర్ రష్మి ..‘కుక్కలు మనలాంటి ప్రాణులే. వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలి. టీకాలు వేయించి, వాటి జనాభాను నియంత్రిచాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో ఆమెను ఓ రేంజ్ లో నెటిజన్లు ఆడేసుకున్నారు. ఇక ఇప్పుడు అక్కినేని అమల వీధి కుక్కల విషయంలో పలు ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

‘50వేల సంవత్సరాల క్రితమే మనుషులకి, కుక్కలకి మధ్య బంధం ఏర్పడింది. అరుదుగా జరిగే ఇలాంటి ఘటన వల్ల కుక్కలు అన్నింటికి ప్రమాదం తలపెట్టకూడదు. టీకాల ద్వారా వాటి సంఖ్యను నియంత్రించడానికి అధికారులకి సహకరించండి. ఓ వ్యక్తి హంతకుడైనంతా మాత్రానా మానవత్వం మీద అనుమాన పడతామా. అలాగే ఒక్క కుక్క చేసిన పనికి ఆ జాతి మీదే కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. కుక్కలు మనుషులను ప్రేమిస్తాయనే విషయం గుర్తుంచుకోండి. మనం వాటికి ఆహారాన్ని ఇస్తే.. అవి మనల్ని రక్షిస్తాయి’ అని చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగా ఆమె ఆలా అన్నదో లేదో గాని సోషల్ మీడియా లో ఆమె ఆ కామెంట్స్ చేసినట్లు ప్రచారం అవుతుంది.