నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets in profits
Markets in profits

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 311 పాయింట్లు నష్టపోయి 62,917కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 18,688కి దిగజారింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.16 వద్ద కొనసాగుతుంది.