లాభాల నుంచి నష్టాల్లోకి మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటంతో ఈ ఉదయం భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంట గంట వరకు సూచీలు లాభాల్లో కొనసాగాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్ల వరకు లాభపడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్లు నష్టపోయి 52,372 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప లాభంతో 15,692 వద్ద స్థిరపడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/