విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా(80) ను శరత్ పవర్ ప్రకటించారు. గతంలో కేంద్రమంత్రిగా మార్గరెట్ పనిచేశారు. నిన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేరు ప్రకటించారు. తాజాగా విపక్షాలు తమ అభ్యర్థి పేరును ఖరారు చేశారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం విపక్షాలు ఆదివారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో సమావేశమయ్యాయి. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం మార్గరెట్ ఆల్వాను ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు.

1942లో మంగళూరులోని రోమన్‌ కాథలిక్‌ కుటుంబంలో మార్గరెట్ ఆల్వా జన్మించారు. గతంలో గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలు ప్రధానులుగా ఉన్న సమయంలో.. మార్గరెట్‌ కేంద్రమంత్రిగా సేవలందించారు. మార్గరెట్‌ 1974-98 వరకు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు.