మేజర్ మూవీ ఫై వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల జల్లు..

అడివి శేషు హీరోగా నటించిన మేజర్ మూవీ ఫై వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. కెరియర్ స్టార్టింగ్ నుండి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న నటుడు అడివి శేష్..తాజాగా మేజర్ మూవీ తో జూన్ 03 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శేష్ ఈ మూవీ లో హీరోగా నటించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. శశి కిరణ్ తిక్క ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించగా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అడివి శేషు యాక్టింగ్ ఫై , శశి డైరెక్షన్లపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. కేవలం సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు , పలు రాష్ట్రాల సీఎం ల తో పాటు క్రీడాకారులు సైతం సినిమా ఫై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు.

తాజాగా ఈచిత్రంపై టీమిండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చైర్మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఇప్పుడే మేజర్‌ సినిమాను చూశాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్‌. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజమైన స్ఫూర్తిదాయకమైన కథ ఇది. మీకు బాగా నచ్చుతుంది. అడివి శేష్‌ అద్భుతంగా నటించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది’అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు.

Just finished watching #Major and I have to say it’s not just a film but an emotion. A really inspiring story of Major Sandeep Unnikrishnan that hits you right in the feels.
Great job by @AdiviSesh to take it to another level.
A must-watch! 👌🏻 pic.twitter.com/0nOxIwJCvL— VVS Laxman (@VVSLaxman281) June 21, 2022